‘ఐసిస్​ కొత్త బాస్​కూ భూమిపై నూకలు చెల్లడం తథ్యం’

ఉగ్రసంస్థ ఐసిస్​ అధినేత అబూ బకర్​ అల్-బాగ్దాదీని వెంటాడి హతమార్చిన అమెరికా.. ఇప్పుడు ఆ సంస్థ కార్యకలాపాలపై దృష్టి సారిస్తోంది. ఇటీవలే కొత్త నాయకుడిని ప్రకటించిన ఆ సంస్థను హెచ్చరించింది అగ్రరాజ్యం. ‘ఆ కొత్తనాయకుడెవరో మాకు తెలియదు.. కానీ, అతడినీ అంతమొందించి తీరుతామని’ సంకేతాలు ఇచ్చింది.

అమెరికా సైనిక ఆపరేషన్​లో బాగ్దాదీ కుక్కచావు చచ్చిన అనంతరం.. ఐసిస్​కు కొత్త నాయకుడిగా అబూ ఇబ్రహీం అల్-హషీమీ అల్-ఖురేషీని ప్రకటించింది ఆ సంస్థ. అయితే అమెరికా మాత్రం ఆ ప్రకటనను తేలికగా పరిగణిస్తోంది. తమకు అతనెవరో తెలియదని, అసలు ఐసిస్​ అనుచరులకూ ఖురేషీ ఎవరో తెలిసి ఉండదని ఎద్దేవా చేసింది.

“ఒకవేళ ఎవరైనా కొత్త నాయకుడు పుట్టుకొస్తే… అతను ఇరాక్​, సిరియాలలోనే ఉంటే… ఈ భూమిపై ఎక్కువ కాలం బతకడు.” -అమెరికా

గత వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్… ఉగ్ర సంస్థ కొత్త నాయకుడి గురించి “అతను ఎవరో మాకు బాగా తెలుసు” అని ట్వీట్ చేశారు. ఆ సమయంలో హషీమీ గురించి అతికొద్ది వివరాలు బయటకు వచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This