‘అల వైకుంఠపురములో’ మలయాళ ఫస్ట్​లుక్​ ఇదిగో..

అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్​లో వస్తోన్న హ్యాట్రిక్ చిత్రం ‘అల వైకుంఠపురములో’. ఈ సినిమా ప్రమోషన్స్​ను మంచి ప్రణాళికతో చేస్తోంది చిత్రబృందం. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజయిన రెండు పాటలు యూట్యూబ్​లో ట్రెండింగ్​లో ఉన్నాయి. ఇప్పుడు మలయాళ వెర్షన్​ ప్రచారాలపై దృష్టి సారించింది చిత్రయూనిట్.

అల్లు అర్జున్ చిత్రాలకు కేరళలో మంచి ఆదరణ ఉంటుంది. అక్కడ బన్నీకి చెప్పుకోదగ్గ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ కారణంగా ‘అల వైకుంఠపురంలో’ మూవీని మలయాళంలో ‘అంగ వైకుంటపురతు’ పేరుతో విడుదల చేస్తున్నారు. త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా మలయాళ టైటిల్, ఫస్ట్​లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం. 10వ తేదీన సామజవరగమన పాట మలయాళ వెర్షన్​ను విడుదల చేయనున్నట్లు తెలిపింది.

బన్నీ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తున్న ఈమూవీలో టబు ఓ కీలక పాత్ర చేస్తోంది. వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుందీ చిత్రం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This