ఆరోజును ముంబయి మర్చిపోదు: అక్షయ్

2008 నవంబరు 26ను ముంబయి వాసులు ఎప్పటికీ మర్చిపోలేరని బాలీవుడ్‌ అగ్రనటుడు అక్షయ్‌కుమార్‌ అన్నారు. ముంబయి మారణహోమంలో ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు. వాళ్లకు ఎప్పటికీ రుణపడి ఉంటామని ఆయన పేర్కొన్నారు.

దేశ వాణిజ్య రాజధానిలో పన్నెండేళ్ల క్రితం పాక్‌ ఉగ్రవాదులు 10 మంది 12 చోట్ల నరమేధం సృష్టించారు. ఆ మారణహోమంలో దాదాపు 166 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 18 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. వందల సంఖ్యలో ప్రజలు క్షతగాత్రులయ్యారు. ఈ దుర్ఘటనపై అక్షయ్‌కుమార్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. అప్పటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

రాఘవ లారెన్స్‌ తొలిసారిగా బాలీవుడ్‌లో దర్శకత్వం వహించిన ‘లక్ష్మి’ చిత్రంలో అక్షయ్‌ ప్రధాన పాత్ర పోషించారు. ఆ సినిమా ఇటీవల ఓటీటీ వేదికగా విడుదలై అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో ఆసిఫ్‌, లక్ష్మి పాత్రల్లో అక్షయ్‌ నటన అందరినీ కట్టిపడేసింంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘సూర్యవంశీ’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో పాటు మరో మూడు సినిమాలతో అక్షయ్‌కుమార్‌ ఫుల్‌ బిజీగా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This