అమ్మాయి ముద్దడిగితే పారిపోయిన అక్షయ్ కుమార్

కోట్లల్లో రెమ్యూనరేషన్​, లెక్కలేనంత మంది అభిమానులు, చేతినిండా సినిమాలు.. ఇది బాలీవుడ్​ హీరో అక్షయ్ కుమార్ ప్రస్తుత జీవితం. కానీ ఓ అమ్మాయి ముద్దడిగితే, అక్షయ్ భయపడి పారిపోయిన సందర్భాలు ఉన్నాయి. టికెట్​ లేకుండా రైలులోనూ ప్రయాణం కూడా చేశారు. ఈ విషయాన్ని గతంలో కపిల్​శర్మ కామెడీ షోకు హాజరైనప్పుడు వెల్లడించారు.

చిన్నప్పుడు స్నేహితులతో కలిసి మహారాష్ట్రలోని మాథెరన్ హిల్​స్టేషన్​కు వెళ్లిన అక్షయ్.. తిరిగి వచ్చేందుకు మిగల్లేదు. చివరకు ఏమైతే అది అయిందని ఏడుగురు ఫ్రెండ్స్ కలిసి ఒకే టికెట్​ కొని రైలు ప్రయాణం చేశారు. అదృష్టం ఏంటంటే టీసీ వీళ్లని పట్టించుకోలేదు.

టీన్​జ్​లో ఉన్నప్పుడు అక్షయ్, ఓ అమ్మాయికి ప్రపోజ్ చేస్తే కాదని పొమ్మందట. ఇండస్ట్రీలోకి రాకముందు ఈ హీరోకు సిగ్గు చాలా ఎక్కువగా ఉండేది. స్నేహితురాలితో బయటకు వెళ్లినప్పుడు చేతులు పట్టుకుని ముద్దు పెట్టమని అడిగేదని, కాని సిగ్గుతో పారిపోయేవాడినని వెల్లడించారు అక్షయ్. ‘నువ్వు వద్దు, నీ ముద్దు వద్దు’ అని చివరకు ఆమె వెళ్లిపోయిందట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This