లంక లీగ్​ నుంచి తప్పుకున్న అఫ్రిది

పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిది అకస్మాతుగా లంక ప్రీమియర్ లీగ్ నుంచి వైదొలిగాడు. గాలే గ్లేడియేటర్స్‌కు సారథిగా వ్యవహరిస్తోన్న అతడు.. ఈ సీజన్​లోని తదుపరి కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు తెలిపాడు. వ్యక్తిగత అత్యవసర కారణాలతో ఇంటికి వెళ్తున్నట్లుగా ట్వీట్​ చేశాడు. పరిస్థితి సద్దుమణగగానే తిరిగొచ్చి మిగతా మ్యాచులకు హాజరవుతానని చెప్పాడు. కాగా, కూతురి అనారోగ్యం కారణంగానే ఆఫ్రిది స్వదేశం బయల్దేరి వెళ్లాడని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.

గొడవపడొద్దు..

నవంబర్​ 29న లంక ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా గాలె గ్లాడియేటర్స్‌, కాండీ టస్కర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్​లో అఫ్గాన్​ యువ పేసర్‌ నవీన్‌ ఉల్‌ హక్‌.. పాక్​ ఆటగాళ్లైన మహ్మద్‌ అమిర్‌, షాహిద్‌ అఫ్రిదితో గొడపడ్డాడు. వీరి మధ్య మాటల యుద్ధం జరిగింది. తాజాగా దీనిని ఉద్దేశిస్తూ తన జట్టు ఆటగాళ్లకు కొన్ని సూచనలు ఇచ్చాడు అఫ్రిది.”యువ ఆటగాళ్లు.. ఆట మీద మాత్రమే దృష్టి పెట్టండి. అనవసరమైన గొడవలకు వెళ్లొద్దు. అప్గాన్​ జట్టులో నాకు మంచి మిత్రులు ఉన్నారు. వారితో బలమైన సంబంధాలు ఉన్నాయి. ప్రత్యర్థి జట్టు, సహ ఆటగాళ్లను గౌరవించడమనేది నైతిక బాధ్యత.” అని అన్నాడు. కాగా, అఫ్రిది నాయకత్వం వహిస్తున్న గాలే టీమ్‌ ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడగా ఒక్కటి కూడా విజయం సాధించలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This