‘ఓటీటీ విలువేంటో ఇప్పుడు అర్థమైంది’

‘సమ్మోహనం’ చిత్రంలో.. సమీరగా ‘అంతరిక్షం’.. లో రియాగా, తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన నటి అదితీరావ్​ హైదరి. బాలీవుడ్​లో కెరీర్​ ప్రారంభించిన ఈ హైదరాబాదీ అమ్మాయి పలు దక్షిణాది చిత్రాల్లోనూ సందడి చేస్తోంది. నాని, సుధీర్​బాబు, ప్రధాన పాత్రల్లో నటించిన ‘వి’ చిత్రంలో హీరోయిన్​గా నటించింది. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ భామ నటించిన మలయాళ చిత్రం ‘సుఫియుమ్​ సుజాతయుమ్’​ ఇటీవలే ఓటీటీ వేదికగా ప్రేక్షకుల మందుకు వచ్చింది. ఈ సందర్భంగా అదితి చెబుతున్న కబుర్లివి..

“నాకు థియేటర్లో సినిమా చూడటమే ఇష్టం. నా సినిమాలు థియేటర్లో విడుదలైతేనే ఆనందం. థియేటర్​ అంటే ఓ మ్యాజిక్​. అదే సమయంలో కొన్ని చిత్రాలకు ఓటీటీలు చక్కటి వేదికలు. నేను నటించిన ‘సుఫియుమ్​ సుజాతయుమ్’​ థియేటర్​ కోసమే సిద్ధం చేసిన సినిమా. అయితే, ప్రస్తుతం ఏర్పడిన విపత్కర పరిస్థితుల కారణంగా ఓటీటీలో విడుదల చేయక తప్పట్లేదు. మొదట్లో ఓటీటీ విడుదల అంటే నాకు నచ్చేది కాదు. కానీ మా చిత్రం ఇంతమందికి చేరువయ్యాక నాకు విషయం అర్థమైంది.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This