పాకిస్థాన్​ వైమానిక మ్యూజియంలో అభినందన్​!

పాకిస్థాన్​ వైమానిక దళం ఆధ్వర్యంలోని ఓ మ్యూజియంలో భారత వాయుసేన వింగ్​ కమాండర్​ అభినందన్​ వర్ధమాన్​ను​ పోలిన విగ్రహాన్ని ప్రదర్శనలో ఉంచారు. కరాచీలోని ఈ మ్యూజియంలో విగ్రహం ముందు ఒక టీ కప్పును, మిగ్​-21 ఎయిర్​ క్రాఫ్ట్​ శిథిల భాగాన్ని ఉంచారు.

ఈ గ్యాలరీకి ‘ఆపరేషన్​ స్విఫ్ట్​ రిటార్ట్’​ అని పేరు పెట్టారు. వర్ధమాన్​ విమానం కూలిపోయిన సన్నివేశాన్ని, వాఘా సరిహద్దు వద్ద ఆయనను తిరిగి భారత్​కు అప్పగించిన ఫొటోలను ప్రదర్శించారు.

ఈ మ్యూజియంలో కొత్తగా ఏర్పాటు చేసిన భాగాన్ని ఈ వారమే ప్రారంభించారు పాక్ ఎయిర్ మార్షల్ చీఫ్ ముజాహిద్ అన్వర్ ఖాన్​.

ఫిబ్రవరి 27న పాకిస్థాన్​ ఎఫ్​-16 యుద్ధవిమానాన్ని కూల్చారు వర్ధమాన్. అనంతరం తన మిగ్-21 యుద్ధవిమానమూ ప్రమాదానికి గురైంది. పారాష్యూట్​ సాయంతో ప్రాణాలతో బయటపడ్డ అభినందన్… పాకిస్థాన్​ భూభాగంలో దిగారు. పాక్​ సైనికులు ఆయనను అదుపులోకి తీసుకుని నిర్బంధించారు. మూడు రోజుల తర్వాత వాఘా సరిహద్దు వద్ద పాక్​ సైన్యం అభినందన్​ను భారత్​కు తిరిగి అప్పగించింది. అతని ధైర్వసాహసాలకు ప్రతీకగా అభినందన్​కు వీర్​ చక్ర పతకం వరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This