సైరా గురించి మహేష్ మాట

నిన్న కన్నులపండువగా అంగరంగ వైభవంగా జరిగిన సినీ మహోత్సవ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని కలిసి ముచ్చటించుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. చిరు అంటే ఎప్పుడైనా సరే ప్రేమాభిమానం చూపించే ప్రిన్స్ దాన్ని ప్రదర్శించే అవకాశాన్ని కూడా ఎన్నడూ వదులుకోలేదు. నిన్నా అదే జరిగింది.

చిరంజీవి గారితో మాట్లాడుతుంటే ఒక రకమైన కొత్త ఎనర్జీ వస్తుందని మరోసారి ఈ సందర్భంగా దాన్ని ఆస్వాదించానని చెప్పడంతో స్టేడియం మొత్తం కరతాళ ధ్వనులతో హోరెత్తిపోయింది. తన ప్రసంగాన్ని ఈ మాటలతోనే మొదలుపెట్టిన మహేష్ ఆపై మరింత కిక్ ఇచ్చేలా సైరా ప్రస్తావన తీసుకొచ్చాడు. సైరా టీజర్ చూశానని నమ్మశక్యంగా లేదని అలాంటి విజువల్ వండర్ ని అందరితో పాటు తనకూ ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆసక్తిగా ఉందని ప్రకటించడంతో మెగా ఫ్యాన్స్ ఈలలు మాములుగా వినిపించలేదు.

ఇవన్నీ చెప్పాక ప్రిన్స్ అసలు టాపిక్ లోకి వెళ్ళాడు. గతంలోనూ చాలా ఏళ్ల కిందటే టాలీవుడ్ లో మొదటి మరియు ఆఖరి మెగాస్టార్ చిరంజీవి ఒక్కరేనని తమ నెంబర్లు ఎప్పటికపుడు మారుతూ ఉంటాయని మహేష్ చెప్పడం ఓ ఇంటర్వ్యూలో హై లైట్ గా నిలిచింది. మళ్ళీ ఇన్నాళ్లకు చిరు అంటే తనకు ఎంత గౌరవమో మరోసారి చాటి చెప్పిన మహేష్ స్పీచ్ తాలుకు వీడియో సైతం బాగా స్ప్రెడ్ అవుతోంది. అతిరథమహారధులు ఎందరు వచ్చినా ఈ మెగా సూపర్ స్టార్ల కలయికే అట్రాక్షన్ ఆఫ్ ది ఈవెనింగ్ గా అందరి దృష్టిని ఆకట్టుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This