ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య

హైదరాబాద్ : ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసిన సంఘటన మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. సిఐ యాదయ్య తెలిపిన వివరాల ప్రకారం… గోపి ,భవ్య ఇద్దరు భార్యభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గోపీ బతుకు దెరువు కోసం నగరానికి వచ్చి అల్కాపురిలో నివాసం ఉండేవాడు. భార్య భర్తలు ఇద్దరు కలిసి వీరస్వామి దగ్గర కొంత కాలం పనిచేశారు. వీరస్వామి నాగోల్ దగ్గర కంకర, ఇసుక వ్యాపారం చేస్తాడు. గోపి ఇంటికి వీరస్వామి తరుచు వచ్చేవాడు. ఈ క్రమంలో గోపి భార్య లక్ష్మి వీరస్వామితో వివాహేతర సంబంధం ఏర్పడింది. గోపీ భార్య వీరస్వామితో వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయం బయటపడడంతో నిత్యం భార్య భర్తల మధ్య గొడవలు జరిగేవి. దీంతో గోపీ అల్కాపురి నుంచి భూపేష్ గుప్తా నగర్‌కు రూమ్ మార్చాడు.

అయినా భార్య ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. ఆదివారం రాత్రి భార్య భర్తల మధ్యన గొడవ జరిగింది. లక్ష్మి గొడవ జరిగిన విషయం ప్రియుడు వీరస్వామికి చెప్పింది. ఈ క్రమంలో  గోపి అనుకోకుండా మరణించాడని  మృతదేహాన్ని సొంత గ్రామానికి తీసుకువెళ్లింది భవ్య. గోపి ఎలా చనిపోయాడని గోపి తండ్రి భవ్య కోడలును నిలదీయంగా ఆమె చెప్పిన మాటలకు పొంతన కుదరలేదు. గోపి ముఖం పై గాయాలు ఉడటంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది.వీరస్వామి ఇద్దరు కలసి గోపిని హత్య చేసి ఉంటారన్నారని బంధువులు అనుమానించి సంస్థానారాయణ పురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బంధువులు ఫిర్యాదు మేరకు కేసును పరిశీలించి మీర్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని పోలీసులు చెప్పారు. దీంతో బంధువులు మృతదేహాన్ని మీర్‌పేట పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. గోపి తండ్రి  ఇచ్చిన ఫిర్యాదు మేరకు గోపి భార్య లక్ష్మి, ప్రియుడు వీరస్వామి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ యాదయ్య తెలిపారు. పోస్టుమార్టం నిమితం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest

Share This